కలం, వెబ్ డెస్క్ : భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో కూటమి నేతలు క్రెడిట్ చోరీ చేయటం కోసం పడరాని పాట్లు పడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడికి ప్లాన్ చేశారు. దాదాపు 15 వేల ఎకరాల భూసమీకరణ చేయాలనుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ఏకంగా 130 కేసులు వేశారు. మా హయాంలో 2,700 ఎకరాలకు భూసమీకరణ పూర్తి చేశాం. 2,200 ఎకరాలు ఎయిర్‌పోర్ట్ కోసం కాగా, 500 ఎకరాలు ఎయిరో సిటీకి కేటాయించామని జగన్ తెలిపారు.
మా ప్రభుత్వంలో కోర్టు కేసులు మొత్తం క్లియర్ చేసి.. మూడు గ్రామాల్లో 400 కుటుంబాలు తరలించి కాలనీ కట్టామనీ జగన్ అన్నారు. ఆ రోజుల్లో విమానయాన మంత్రిగా అశోక్ గజపతి రాజు ఉండగా చంద్రబాబు ఒక్క అనుమతి కూడా తెచ్చుకోలేక పోయారు. మా హయాంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెంటపడ్డామని, తానే స్వయంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానిని అనేక సార్లు కలిసి వినతి పత్రం ఇచ్చానని జగన్ వెల్లడించారు.


