Mobile Popup Ad
Mobile Popup Ad

బండి భగీరథ్‌ పై చేసిన వీడియోను వక్రీకరించారు: దొరసాయి తేజ

కలం, వెబ్ డెస్క్ : బండి భగీరథ్ (Bandi Bhagirath) అంశంపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ దొరసాయి తేజ (Dorasai Teja) ఓ వీడియో రిలీజ్ చేయడంపై తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఫోక్స్ కేసు అంశంలో బాధితురాలి వివరాలను బట్టబయలు చేశారని దొరసాయి తేజపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా తాను రిలీజ్ చేసిన వీడియో పోస్టును తొలగించిన దొరసాయి తేజ.. బండి భగీరథ్ పై చేసిన వీడియోను కొందరు కావాలనే వక్రీకరించారని చెబుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా గత 15 సంవత్సరాలుగా తన ప్రయాణం మొత్తం అందరి ముందే జరిగిందని, తాను ఈ స్థాయిలో ఉండటానికి మీ ప్రేమ, నమ్మకమే కారణమని అడియెన్స్ ను ఉద్దేశించి అన్నారు. ఇటీవల బండి భగీరథ్‌ అంశంపై రిలీజ్ చేసిన ఓ చిన్న వీడియోను కొంతమంది స్వార్థపూరిత కోణంలో చూస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ భగీరథ్ తప్పు చేసి ఉంటే, చట్టప్రకారం అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలని తాను స్పష్టంగా చెప్పినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆ మాటలను పక్కన పెట్టి, కొన్ని క్లిప్స్‌ను మాత్రమే కట్ చేసి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు.

తాను ఎప్పుడూ తప్పును సమర్థించలేదని, సమర్థించబోనని స్పష్టం చేశారు. సోషల్ మీడియా తనకు కేవలం సరదా కాదు, అది తన జీవితం.. కుటుంబానికి ఆధారం అని దొరసాయి తేజ (Dorasai Teja) పేర్కొన్నారు. 15 సంవత్సరాల కష్టం మీద సంపాదించుకున్న గౌరవాన్ని ఒకే ఒక్క వీడియోతో పణంగా పెట్టలేనని.. ఈ అంశం ఎంత సున్నితమైనదో గుర్తించి, ఇకపై ఎలాంటి అపోహలు రాకూడదనే ఉద్దేశంతో తన అభిప్రాయంతో ఉన్న ఆ వీడియోను తొలగిస్తున్నానని వెల్లడించారు. ఒక చిన్న క్లిప్ చూసి తన 15 ఏళ్ల ప్రయాణాన్ని జడ్జ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Read Also: వేసవిలో మామిడి పండ్లు ఎందుకు తినాలి? సైన్స్ చెబుతున్న నిజాలు ఇవే!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>