epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మా పిల్లలని యూట్యూబ్ చూడనివ్వము – యూట్యూబ్ సీఈఓ

కలం, వెబ్​డెస్క్​: సోషల్​ మీడియాను అతిగా వాడకుండా తమ పిల్లలపై కఠినంగా వ్యవహరిస్తామని యూట్యూబ్​ సీఈవో నీల్​ మోహన్(Neal Mohan)​ అన్నారు. ఉత్తమ సీఈవోగా ‘టైమ్స్​ 2025 సీఈవో ఆఫ్​ ద ఇయర్​’గా ఎంపికైన ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పిల్లలు యూట్యూబ్​, టిక్​టాక్​, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ వంటి సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్స్​ అధికంగా వాడుతున్నారని, ఫలితంగా దుష్ప్రభావాలకు లోనవుతున్నారని ఆందోళనలు పెరుగుతుండడంపై ఆయన స్పందించారు.‘ మా పిల్లలు సోషల్​ మీడియా అతిగా వాడకుండా నేను, నా భార్య హేమ మోహన్​ ఆంక్షలు అమలుచేస్తాం. మిగిలిన రోజులతో పోలిస్తే వారాంతంలో మరింత కఠినంగా ఉంటాం.

వాళ్లు సాధ్యమైనంత తక్కువగా సోషల్​ మీడియా వాడేలా చూస్తాం. పిల్లలపై సోషల్​ మీడియా ప్రభావం కారణంగానే ఈ ఆంక్షలు పెట్టాల్సి వస్తోంది. యూట్యూబ్​ సీఈవోగా ఆది నా బాధ్యత’ అని నీల్​ మోహన్​ అన్నారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు అత్యున్నత బాధ్యత ఉందని, పిల్లలు సోషల్​ మీడియాను ఎందుకు? ఏ విధంగా వాడుతున్నారో గమనిస్తుండడం కూడా అందులో భాగమని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్​ మీడియా వాడకుండా నిషేధం విధించిన నేపథ్యంలో ఆయన(Neal Mohan)​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read Also: దేశ వ్యాప్తంగా రూ.21వేల కోట్ల ట్రాఫిక్ చలాన్లు పెండింగ్..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>