Mobile Popup Ad
Mobile Popup Ad

లారీ ఢీకొని యువకుడి మృతి.. శోకంలో తల్లి

కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanamkonda) జిల్లా ఐనవోలు మండలం పున్నెలు క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జఫర్ గడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన తల్లీ, కొడుకు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కొడుకు పిన్నింటి అనిల్ (23)లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి బైక్ పై నుంచి పక్కకు పడడంతో ప్రమాదం తప్పింది. కొడుకు మృతిని కళ్లరా చూసిన తల్లి గుండెలు పగిలేలా రోదించిన తీరు స్థానికంగా విషాదం నింపింది. మృతుడు లండన్ లో ఉన్నత చదువులు చదువుతున్నట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>