Mobile Popup Ad
Mobile Popup Ad

సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌లో చిట్టీ డబ్బుల వివాదం యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. అరుకాల సాయికుమార్ అనే యువకుడు జమ్మికుంటకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.6 లక్షల చిట్టీ డబ్బులు కట్టాడు. గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు బంగారు గొలుసు, క్రెడిట్ కార్డులు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయికుమార్ ఓ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. “ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా.. అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నాను” అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేస్తూ పురుగుమందులు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి, వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>