పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక యువతి సూసైడ్‌..!

క‌లం, వెబ్ డెస్క్‌: మ‌ల్కాజిగిరి (Malkajgiri) జిల్లాలోని బడంగ్‌పేట్‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. పెంపుడు పిల్లి మృతిని త‌ట్టుకోలేక ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. దీనిపై మీర్‌పేట్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. బడంగ్‌పేటకు చెందిన హిమబిందు అనే యువతి బీఎస్సీ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. రెండేళ్ల నుంచి వీరి ఇంట్లో ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. ఇటీవ‌ల ఆ పిల్లి మృతి చెందింది. దీంతో తీవ్ర మ‌నోవేద‌ను గురైన హిమ‌బిందు పాయిజ‌న్ తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మృతురాలి సోద‌రుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్నారు. త‌మ చెల్లెలికి పిల్లి అంటే ఎంతో ఇష్ట‌మ‌ని, అది చ‌నిపోయిన‌ప్ప‌టి నుంచి దిగులుగా ఉంటోంద‌ని మృతురాలి సోద‌రుడు తెలిపాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>