కలం వెబ్ డెస్క్ : ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో రూ.300 కోట్ల మోసానికి పాల్పడ్డ జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్(Jayatri Infrastructures) ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కాకర్ల శ్రీనివాస్(Kakarla Srinivas)ను ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం చెన్నైలో అరెస్ట్ చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్(pre-launch offer) పేరిట శ్రీనివాస్ పలువురు కొనుగోలుదారుల నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డాడు. నగదు చెల్లించినా ఇల్లు ఇవ్వకుండా మోసం చేశాడు.
ఈ అంశంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన అనంతరం బెయిల్‌పై విడుదలైన శ్రీనివాస్ మొదటి రోజే పరారయ్యాడు. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు చెన్నైలో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. నేడు శ్రీనివాస్‌ను హైదరాబాద్‌కు తరలించి కోర్టులో హాజరుపరచనున్నారు.
Read Also: ఆర్బీఐ ‘ఉద్గమ్’ పేరుతో మోసాలు, లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ గుల్ల
Follow Us On : WhatsApp


