epaper
Sunday, February 22, 2026
epaper

ప్లాస్టిక్ డ్రమ్‌తో గిటార్ మ్యూజిక్.. ఇండోనేషియా యువకుడు అదుర్స్

కలం, వెబ్ డెస్క్: గిటార్ అనగానే మెరిసిపోయే ఖరీదైన చెక్క, తీగలు గుర్తొస్తాయి. కానీ, ఇండోనేషియా (Indonesia)కు చెందిన ఓ యువకుడు మాత్రం తన క్రియేటివిటితో ఆశ్చర్యపరుస్తున్నాడు. ఓ పాత నీలి రంగు ప్లాస్టిక్ డ్రమ్‌ను గిటార్‌గా మార్చి అద్భుతమైన సంగీతాన్ని పలికిస్తున్నాడు. ప్లాస్టిక్ డ్రమ్‌కు గిటార్ నెక్‌ను అమర్చి, దానికి తీగలను అటాచ్ చేసి ప్రయోగం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ డ్రమ్ గిటార్ నుంచి వస్తున్న శబ్దం ఎలక్ట్రిక్ గిటార్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదు.

ఈ యువకుడు ప్లాస్టిక్ డ్రమ్ గిటార్‌తో పాపులర్ పాటల (Songs) ట్యూన్‌లను ప్లే చేస్తున్న వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘ప్రతిభకు పేదరికం అడ్డంకి కాదు’’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వ్యర్థమైన వస్తువులతో సంగీత పరికరాలను తయారు చేయవచ్చునని ఈ యువకుడు నిరూపించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>