epaper
Sunday, February 22, 2026
epaper

భవానీపురం మిస్సింగ్ కేసు.. దొరికిన పిల్లలు

కలం, డెస్క్ : భవానీపురంలో మిస్ అయిన ఇద్దరు పిల్లల ఆచూకీ దొరికింది. ముంబైలో వీరిని పోలీసులు పట్టుకున్నారు. నిన్న విజయవాడలోని (Vijayawada) భవానీపురంలో ఇద్దరు పిల్లలు బెహ్రారామ్‌(13), ఉమారామ్(14) మిస్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ట్యూషన్ కు అని చెప్పి ఓ ఆటో ఎక్కి వెళ్లిపోయారు. పోలీసులు ఆటో డ్రైవర్ ను కనిపెట్టి ఎక్కడ దింపాడో వివరాలు తెలుసుకున్నారు. వీరిద్దరూ రాజస్థాన్ రైలు ఎక్కి ముంబై వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ముంబై పోలీసులతో మాట్లాడి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ రాజస్థాన్ లోని బంధువుల ఇంటికి వెళ్లడానికి ట్రైన్ ఎక్కినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరినీ వెనక్కు తీసుకొస్తున్నారు పోలీసులు.

ఏమైందంటే..?

భవానీపురంలోని కరూర్ వైశ్యాబ్యాంకు దగ్గర్లో దేవాసి కాలారామ్ నివాసం ఉంటున్నాడు. ఆయన కొడుకు ఉమారామ్(14) స్థానిక స్కూల్ లో చదువుకుంటున్నాడు. వారి బంధువులు కుమారుడు బెహ్రారామ్ (13) కూడా అదే స్కూల్ లో చదువుతున్నాడు. వీరిద్దరూ నిన్న ట్యూషన్ కు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయటకు వచ్చారు. కానీ ట్యూషన్ కు వెళ్లకుండా ఆటో ఎక్కి వెళ్లిపోయారు. ఇరువురి పేరెంట్స్ రాత్రి దాకా వెతికి.. చివరకు పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు. అయితే రాజస్థాన్ లోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉందని ఇరువురి పేరెంట్స్ చెప్పడం వల్ల.. పిల్లలు అక్కడికే వెళ్లడానికి ట్రై చేశారేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>