కలం, కరీంనగర్ : శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Srinivas) పేర్కొన్నారు. నగరంలోని సెయింట్ జాన్, సెయింట్ ఆల్ఫోన్స్ పాఠశాలల వేదికగా నిర్వహిస్తున్న అండర్-17 (Under-17) బాలబాలికల రాష్ట్ర స్థాయి (State-Level) బాస్కెట్ బాల్ (Basketball) క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులు, కోచ్ లతో కలిసి బాస్కెట్ బాల్ పోటీలను లాంచనంగా ప్రారంభం చేశారు. మేయర్ కోర్టులో బాస్కెట్ బాల్ వేసి క్రీడలను ఉత్సాహపరిచారు.
అనంతరం పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకొని… అభినందించారు. బాస్కేట్ బాల్ పోటీల్లో వివిధ జిల్లాల నుండి దాదాపు 240 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ…క్రీడల్లో గెలుపోటములు సహజమని..వాటిని సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. చక్కటి నైపుణ్యంతో ఆడుతూ… క్రీడా కారులు తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. బాస్కెట్ బాల్ టీంతో కలిసి ఆడే ఆట అని… టీంలో ప్రతి ఒక్క క్రీడాకారుడు టీం స్పిరిట్ తో ఆడితేనే విజయం సొంతం అవుతుందని పిలుపు నిచ్చారు.
ప్రతి క్రీడాకారుడికి బాస్కెట్ బాల్ ఆటలో సమయస్పూర్తి చాలా ప్రధానమైందని అన్నారు. బాస్కెట్ బాల్ లో ప్రతి గోల్ ను టార్గెట్ తో చేస్తేనే చక్కటి పాయింట్లు లభిస్తాయని తెలిపారు. ఈ క్రీడలో చాకచక్యం… చురుకుదనం చాలా ప్రధానం అన్నారు. వివిధ జిల్లాల నుండి వచ్చి ప్రతి క్రీడాకారుడు చక్కటి నైపుణ్యం ప్రదర్శించి తమ తమ జట్టులకు విజయాలను చేక్చూర్చాలన్నారు. ప్రతి క్రీడలో గెలుపు, ఓటములు సహజం అన్నారు.
క్రీడలో చక్కటి మెలకువలతో క్రీడాకారుడు నైపుణ్యం ప్రదర్శించాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు క్రీడాకారులు ఎదగాలన్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా క్రీడాకారులు ప్రతి స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని… జిల్లాకు మంచి పేరు తీస్కరావాలని కోరారు. ప్రభుత్వాలు కూడ క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు.
నగరపాలక సంస్థ ద్వారా పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహిస్తున్నామని… ప్రతి వేసవి కాలంలో నగరపాలక సంస్థ ఆద్వర్యంలో నిధులు కేటాయించి సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు 28 క్రీడల్లో క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ…మెలకువలు నేర్పి… క్రీడారారులను తయారు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ , గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ బన్సిలాల్, పలువురు పి. టీ లు పిడి లు, పాఠశాలల యాజమాన్యం, క్రీడా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

