ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

కలం, నిర్మల్ : నిర్మల్‌ రూరల్‌ మండలం కౌట్ల (కె) గ్రామంలో (Koutla K village) తోకల సతీష్‌ (26) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్టు ఏఎస్సై శివయ్య సోమవారం తెలిపారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన సతీష్‌ తన పాత, శిథిలావస్థలో ఉన్న ఇంటిలో చేపలు పట్టేందుకు ఉపయోగించే తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>