కరీంనగర్ బీజేపీ ఎస్టీ మోర్చాకు కొత్త కార్యవర్గం

కలం, కరీంనగర్: భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా (BJP ST Morcha) కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమావత్ శ్రీనివాస్ నాయక్ సోమవారం నూతన కార్యవర్గ వివరాలను వెల్లడించారు. నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా బిజిలి సారయ్య, మాలోతు శ్రీనివాస్ నాయక్, లావుడ్య తిరుపతి నాయక్, బిజిలి శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా విస్లావత్ శ్రీనివాస్ నాయక్, మొగిలి శ్రీనివాస్, కార్యదర్శులుగా బానోతు శివ, గుగులోత్ శ్రీకాంత్, లకావత్ శేఖర్, కట్ల సంపత్‌లను నియమించారు.

మీడియా కన్వీనర్‌గా గుగులోత్ వంశీ, సోషల్ మీడియా కన్వీనర్‌గా మాలోత్ దీక్షిత్, ఐటీ కన్వీనర్‌గా మానుపాటి కుమార్, ఆఫీస్ సెక్రటరీగా భూక్య హరి, మన్ కీ బాత్ కన్వీనర్‌గా బిజిలి కిషన్ నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా లావుడ్య బిక్షపతి, ఇస్లావత్ రవి, కెమసారం స్వామి, లావుడ్య సోమన్న, కున్సోత్ శ్రీనివాస్‌లను నియమించారు.

నూతనంగా నియమితులైన జిల్లా కార్యవర్గ సభ్యులందరూ జిల్లాలో ఎస్టీ మోర్చా, బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు రమావత్ శ్రీనివాస్ నాయక్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దేశ అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>