కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్ సబ్‌స్టేషన్‌లో నూతన 11 కేవీ ఫీడర్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం (Power Supply Interruption) ఉంటుందని ఏడీఈ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అగ్రికల్చర్ మార్కెట్ ఏరియా, మోచిగల్లీ, బుధవార్‌పేట్, గాంధీచౌక్, కబూతర్ కమాన్, బంగల్‌పేట్, నాయుడువాడ, బోయివాడ, రాంరావుభాగ్, సాయిబాబా ఆలయ ప్రాంతం, నందిగుండం దుర్గామాత ఆలయ ప్రాంతం, విశ్వనాథ్‌పేట్, వైఎస్సార్ కాలనీ, గాజులపేట్, డాక్టర్స్ లైన్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. ఆయా కాలనీలకు చెందిన వినియోగదారులు సహకరించాలని కోరారు.

