ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాజకీయ జోక్యాన్ని నివారించాలి: సిపిఎం

కలం, వలిగొండ : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యాన్ని ఆపాలని అర్హులైన పేదలందరికీ ఇండ్లను మంజూరు చేయాలని సిపిఎం (CPM) నాయకులు డిమాండ్​ చేశారు. వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఎంపికలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిలువరించాలని, అధికార పార్టీ రాజకీయ జోక్యాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సిపిఎం పులిగిల్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా పార్టీ (CPM) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, సీనియర్ నాయకులు కళ్లెం సుదర్శన్ రెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు వాకిటి వెంకటరెడ్డిలు మాట్లాడారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకం,రాజకీయ జోక్యానికి వేదికగా మారిందన్నారు. అర్హతలు, పేదరికం, నిజమైన అవసరాలను ప్రాతిపదికగా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన ప్రభుత్వం, రాజకీయ సిఫార్సులకు తలొగ్గితే పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలని అన్ని రాజకీయ పార్టీలతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>