Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌లో పికా చెస్ కాంపిటిషన్.. అదరగొట్టిన చిన్నారులు

కలం, స్పోర్ట్స్ : హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలోని వారాహి బాంక్వెట్స్‌లో ప్రత్యూష ఇంటర్నేషనల్ చెస్ అకాడమీ (PICA) నిర్వహించిన ‘9వ పికా చిల్డ్రన్స్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్’ (PICA Children Chess Tournament) ఘనంగా ముగిసింది. అందులో చిన్నారులు తమ బుద్దిబలంతా అబ్బురపరిచారు. వేర్వేరు వయసు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని టైటిళ్లను కైవసం చేసుకున్నారు.

ఈ పోటీల్లో బాలుర అండర్-8 కేటగిరీలో బైరి దేవాన్ష్ రెడ్డి విజేతగా నిలవగా.. కె. భువన్, అద్విత్ అనిశెట్టి తర్వాతి స్థానాల్లో నిలిచారు. అండర్-10 విభాగంలో ఇషాన్ సాతిరాజు మొదటి స్థానం సాధించగా.. ఎమ్ భవ్యేష్ బాలాజీ రెడ్డి, వేదాంశ్ సుఖవాసి, కే జతిన్ రెడ్డి, నిర్వానా చన్నా తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. ఇక అండర్-12 విభాగంలో సాయి సాత్విక్ జయంపు విజేతగా నిలవగా.. ప్రతుల్ మారెడ్డి, ఆర్ శ్రేయాన్స్ రెడ్డి, దైవిక్ సాహూ, ఎం ఆకాష్ భార్గవ్ రెడ్డి తర్వాతి స్థానాల్లో నిలిచారు. అండర్-14 విభాగంలో అభిరామ్ సింగంశెట్టి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా.. జి సాయి నమిష్, జి హయగ్రీవ సాయి రెండు, మూడు స్థానాలను సొంతం చేసుకున్నారు.

బాలికల అండర్-8 విభాగంలో సాతిరాజు శ్లోక విజేతగా నిలవగా.. కెవ్యుర వల్లి, హన్వి పెద్దినేని తర్వాతి స్థానాల్లో నిలిచారు. అండర్-10 విభాగంలో నిత్య కొండూరి మొదటి స్థానం సాధించగా.. వి నిత్య, అడపా లౌక్య రన్నరప్‌లుగా నిలిచారు. అండర్-12 విభాగంలో పల్లా అమైరా టైటిల్ గెలవగా.. ఆరియా శ్రీవాత్సవ, ఆద్య గుర్రపు తర్వాతి స్థానాలు సాధించారు. చివరగా ఉత్సాహంగా సాగిన అండర్-14 విభాగంలో ఆయత్ బజాజ్ విజేతగా నిలిచింది. పి నిత్యశ్రీ, ఆకాంక్ష శ్రీ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>