విషాదం.. చెరువులో గల్లంతై బాలుడు మృతి

కలం, వెబ్ డెస్క్ : రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సృజన్ (15) అనే బాలుడు మల్యాల చెరువులో గల్లంతై మరణించాడు. గ్రామానికి చెందిన సృజన్ ఈత నేర్చుకోవడానికి ఊర చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చెరువు వద్దకు చేరుకున్నారు. బాలుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>