Mobile Popup Ad
Mobile Popup Ad

యర్రగొండపాలెంలో ఘోరం: యువకుడిని నరికి బోరుబావిలో పడేశారు

కలం, వెబ్‌ డెస్క్ : మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం (Yerragondapalem)లో బ్లాక్‌మెయిల్ వివాదం ఒక ఘోర హత్యకు దారితీసింది. గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన దిగుడు ఆంజనేయులు (21) అనే యువకుడు దారుణ హత్యకు గురైనట్లు వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

పోలీసుల విచారణలో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. మృతుడు ఆంజనేయులు ఒక యువతికి సంబంధించిన పాత వీడియోలను చూపిస్తూ గత కొంతకాలంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఈ విషయం సదరు యువతి కుటుంబ సభ్యులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో వారు ఆ యువకుడిని అంతమొందించేందుకు ఒక పథకం వేశారు. ఈ నెల 13న రాత్రి సమయం చూసి సదరు యువతితో ఆంజనేయులును తమ ఇంటికి పిలిపించారు. అక్కడ యువతి తల్లిదండ్రులు, ఆమె కలిసి ముగ్గురూ ఒక్కసారిగా ఆంజనేయులుపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు తీశారు.

హత్య అనంతరం ఆనవాళ్లు దొరకకుండా చేయడం కోసం నిందితులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ ముక్కలను సమీపంలోని బోరుబావిలో పడేశారు. యువకుడు కనిపించకుండా పోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా ఈ ఘోరం బయటపడింది. ప్రస్తుతం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోరుబావిలో పడేసిన శరీర భాగాలను వెలికితీసేందుకు ప్రత్యేక కెమెరాలను లోపలికి పంపి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>