‘ఆహా.. ఎంత రుచిగా ఉన్నాయో!’.. సీఎం చంద్రబాబు ఫిదా

కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) తాటి ముంజలు రుచి చూసి ఫిదా అయ్యారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకి వెళ్లిన సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరీ దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో రోడ్డు పక్కన ఆగి, తాటి ముంజలు విక్రయిస్తున్నవారి వద్దకు వెళ్లారు. తాటి ముంజలు తింటూ.. కాసేపు వారితో మాట్లాడారు. కల్లు గీత కార్మికుల జీవన విధానం, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, వారికి డబ్బులు ఇచ్చి తిరిగి వెళ్లిపోయారు.

‘అంతకు మించింది ఏముంటుంది..’

తాటి ముంజలు తింటున్న ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబు ‘కల్తీ లేదు.. కార్బైడ్ లేదు.. పురుగు మందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించింది ఏముంటుంది!’ అని పేర్కొన్నారు. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి తమ వద్దకు వచ్చి తాటిముంజలు ఆరగించడంపై దుకాణదారులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎంతో ఫొటోలు దిగారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>