‘టాక్సిక్’ ట్రైలర్ ఈరోజే.. శివన్న స్పెషల్ అట్రాక్షన్

కలం, సినిమా : కన్నడ స్టార్ యశ్(Yash) నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్‌ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) ట్రైలర్ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు డా. శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. “ఎపిక్ అన్‌వీల్ కోసం మెజెస్టిక్ ప్రెజెన్స్” అంటూ శివరాజ్‌కుమార్‌కు స్వాగతం పలికింది.

ఇక ‘టాక్సిక్’ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 7:01 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ కోసం యశ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026, ఆగష్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. భారీ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుండి  ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, గ్లింప్స్ సినిమాకు సూపర్ హైప్ తీసుకొచ్చాయి. ట్రైలర్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులలో ఉత్కంఠ పెరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>