కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లోని మథుర జిల్లాలోని బృందావన్ వద్ద యుమునా నదిలో (Yamuna River) ఘోర విషాదం చోటు చేసుకుంది. పంజాబ్ లోని ముక్త్సర్ కు చెందిన భక్తుల బృందం పడవలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న వారంతా నదిలో మునిగిపోయారు. ఈ ఘటనలో సుమారు 25 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో అప్రమమత్తమైన పోలీసులు, స్థానిక గజ ఈతగాల్లు సంఘటన స్థలానికి చేరకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే ఆరు మృతదేహాలు వెలిగితీసినట్లు సమాచారం అందుతోంది. మిగతా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: సంచలనం.. ప్రధాని మోదీ హత్యకు కుట్ర?
Follow Us On: Sharechat

