Mobile Popup Ad
Mobile Popup Ad

రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని రౌడీ షీటర్లను శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా యాదాద్రి డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ (Yadagirigutta Police) ఆధ్వర్యంలో వివిధ నేరాలకు పాల్పడిన పాత నేరస్థులను, రౌడీ షీటర్లకు, పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాలకు దూరంగా ఉండాలని రౌడీ షీటర్లకు సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని.. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుతూ కుటుంబ సభ్యుల గౌరవాన్ని నిలబెట్టేలా మంచి ప్రవర్తనతో జీవించాలని చెప్పారు. అంతేకాకుండా శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలన్నారు. ప్రతి నెలలో రెండు సార్లు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ యాదయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>