కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట (Yadagirigutta) కొండపైన వర్తక సంఘాని రద్దు చేసి టెండర్లు వేయాలని కోరుతూ యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం నుండి పాతగుట్ట చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్ స్టాండ్ వద్ద ధర్నా నిర్వహిస్తూ రోడ్డుపై బైటాయించి ధర్నా నిర్వహించిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాన్ని రద్దుచేసి టెండర్ వేయాలని డిమాండ్ చేశారు. సంఘం రద్దు ద్వారా దేవస్థానానికి రూ.20 కోట్ల నుండి రూ.30 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, పల్లపు బాలయ్య, బండ రామస్వామి, దేవపూజ అశోక్, గ్యాదపాక బాల నరసయ్య, బుగ్గా ఆంజనేయులు, మాటూరి బాలయ్య, దండబోయిన వీరేష్, బంధారపు మల్లేష్, కొన్నె సంజీవ, బండి అనిల్, ముక్కెర్ల వెంకటేష్, నర్సింహా, గోపగాని ప్రసాద్, దొమ్మాట ప్రభాకర్, మందోజు నరేష్, కర్రె శ్యామ్, కొన్నె ప్రశాంత్, గుండు కుమార్, సుధాగాని శివ, వాల్మీకి అజయ్, గ్యాదపాక క్రాంతి, పలుగుల సురేష్, శ్రీనాథ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

