కలం, వెబ్ డెస్క్ : యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై అమిత్ షా (Amit Shah) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీపై కుట్ర మొదలయిందన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘జనజాతి సాంస్కృతిక సమాగమం’ లో కేంద్ర షా మాట్లాడారు. ఏకరీతి పౌర స్మృతి (UCC) గిరిజన ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను, ఆచారాలను, జీవించే హక్కును హరిస్తుందనే ఒక కుట్ర ఇప్పుడే మొదలైందన్నారు.
గిరిజన సమాజం, గిరిజన ప్రజలపై యూసీసీ కి సంబంధించిన ఎటువంటి ఆంక్షలూ గానీ విధించే అవకాశం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. UCC గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగాన్ని కలిగించదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరాఖండ్ లో యూసీసీ అమలు చేశామని గుర్తు చేశారు. ప్రత్యేక నిబంధనలను రూపొందించడం ద్వారా, మోదీ ప్రభుత్వం గిరిజన సమాజాలన్నింటినీ యూనిఫాం సివిల్ కోడ్ పరిధి నుండి మినహాయించిందని అమిత్ షా వెల్లడించారు.

