Mobile Popup Ad
Mobile Popup Ad

CEIRతో దొంగల పని పట్టిన పోలీసులు.. 12 లక్షల ఫోన్లు రికవరీ!

కలం, యాదాద్రి భువనగిరి: చోరీకి గురైన మొబైల్ ఫోన్లను యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి బాధితులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 75 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఈ ఫోన్ల విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫోన్లు పోయిన (Mobile Phones) వెంటనే బాధితులు సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడం వల్ల ఫోన్ల ట్రాకింగ్ సులభమైందని అధికారులు వివరించారు. పోయిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా సాంకేతిక బృందం ప్రత్యేకంగా పరిశీలించి వాటి లొకేషన్‌ను గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో వినియోగంలో ఉన్న ఫోన్లను కూడా ట్రేస్ చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను తప్పనిసరిగా భద్రంగా ఉంచుకోవాలని, అవసరమైతే వెంటనే బ్లాక్ చేయించుకోవాలని తెలిపారు. అలాగే మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అపరిచిత లింకులు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ప్రజల ఆస్తులను రక్షించడంలో జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తోందని ఎస్పీ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>