కలం, వలిగొండ: జన గణనను ఎన్యుమనేటర్లు, అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Anuraag Jayanti) అన్నారు. శనివారం వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ఎన్యుమనేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్యుమనేటర్లతో మాట్లాడుతూ.. జనగణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. స్వీయ గణనపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ నెల 26 నుండి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం ఉంటుందని, దీంతో జనగణన కొంత సులువుగా పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ, మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్, ఆలకుంట్ల శ్రీను, ఎన్యుమనేటర్లు పాల్గొన్నారు.
Read Also: మళ్లీ పుట్టిన ‘టీఆర్ఎస్’.. పేరు, జెండా వెనుక కవిత స్ట్రాటజీ ఏంటి?
Follow Us On: Sharechat

