మంత్రివ‌ర్గంలో అవ‌కాశం ఇవ్వండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్​..!

క‌లం, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్​ (Congress) పార్టీలో కోమటి రెడ్డి రాజగోపాల్​ రెడ్డి మంత్రి పదవి కోసం బహిరంగంగానే కీలక వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో మరో నేత తనకూ మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని రిక్వెస్ట్​ చేయడం హాట్​ టాపిక్​గా మారింది. జడ్చర్ల కాంగ్రెస్​ ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి (Anirudh Reddy) తన మనసులోని కోరికను బయటపెట్టారు. యువ నేతలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరారు. తమది నేషనల్​ పార్టీ అని, రీజనల్ పార్టీ లాగా చేతులు కట్టుకొని నిల్చోమని చెప్పారు. కాంగ్రెస్​లో ఖర్గే, రాహుల్​ గాంధీ, పీసీసీ ప్రెసిడెంట్​, సీఎం రేవంత్​, పీసీసీ ఇన్​ చార్జ్​ మీనాక్షి కలిసి నిర్ణయం తీసుకుంటారన్నారు.

ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయ్యింది కదా, మంత్రులను మార్చాలి అని కొందరు అంటున్నారని అనిరుధ్​ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా తన అభిప్రాయం కూడా చెప్పే అవకాశం ఉందని చెప్పారు. చాలా మంది యువ నేతలు ఉన్నారని, ఇంజినీర్స్, డాక్టర్స్ ఉన్నారని, తమకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలే రాష్ట్రం కొత్త మంత్రులను చూడాలని కోరుకుంటున్నారని అనిరుధ్​ రెడ్డి అన్నారు. అయితే తమ బాస్​ సీఎం రేవంత్​, పీసీసీ చీఫ్​ మహేశ్​ అని, వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

Read Also: పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>