విషాదం.. కుస్తీ పోటీల్లో గాయపడి మల్ల యోధుడు మృతి

కలం, నిజామాబాద్ బ్యూరో: కుస్తీ పట్టి చూడు మట్టి కరిపిస్తా అని సినిమాల్లో డైలాగ్ లు వింటుంటాం.. నిజామాబాద్ జిల్లాలో ఓ మల్ల యోధుడు కుస్తీ పోటీల్లో గాయపడి మృతి (Wrestler Dies) చెందాడు. నవీపేట మండలం అభంగపట్నంలో ఈ ఘటన జరిగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం స్థానిక పాఠశాల ఆవరణలో గ్రామస్థులు కుస్తీ పోటీలు నిర్వహించారు. రెంజల్ మండలం నాగేపల్లికి చెందిన మల్లయోధుడు ఎ. లక్ష్మణ్(48) మరో మల్ల యోధుడితో పోటీ పడ్డారు. ఈ క్రమంలో లక్ష్మణ్ మెడకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హుటాహుటిన 108 వాహనంలో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ లక్ష్మణ్ మృతి చెందాడు.

ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హోళీ, ఉగాది, హనుమాన్ జయంతితో పాటు మార్చి, ఏప్రిల్ నెలలో జరిగే జాతరలు, ఆలయాల వార్షికోత్సవాల సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. ఎక్కువగా తెలంగాణలోని మహారాష్ట్ర కర్నాటక బార్డర్ ఏరియాల్లో కూడా జరుగుతాయి. కుస్తీ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన మల్ల యోధులు పాల్గొని అలరిస్తారు. ఈసారి ఇలా కుస్తీ పోటీలో గాయపడి యోధుడు చనిపోవడంతో (Wrestler Lakshman Dies) ఒక్కసారిగా గ్రామస్తులు సైతం షాక్‌కు గురయ్యారు.

Read Also: కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీశ్ రావు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>