Mobile Popup Ad
Mobile Popup Ad

బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ వైసీపీ నిరసనలు

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ నగరం తిరుప‌తిలో వైసీపీ భారీ నిర‌స‌న‌ (YSRCP Protests) చేపట్టింది. టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు (BR Naidu)ను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించింది. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డాడని, ఆయన వ్యవహార శైలితో టీటీడీ (TTD) పవిత్రతను దెబ్బతీస్తున్నాడని వైసీపీ నాయకులు ఆరోపించారు. భారీ ర్యాలీతో తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్దకు తిరుపతి ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి (Bhumana Abhinay Reddy) చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిలుపులో భాగంగా ఈ ర్యాలీ చేపట్టింది. తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ప్ర‌త్యేక‌ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి.. పోలీసులు 30 యాక్ట్ పేరుతో మీడియాపై ఆంక్షలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు వైయస్ఆర్ జిల్లా పులివెందులలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేశారు. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టిటిడి పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్ రెడ్డి వైఎస్ఆర్సిపి శ్రేణులు పాల్గొన్నారు.

నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు (YSRCP Protests) చేయాలని  వైయస్ఆర్సీపీ నిర్ణయించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నిస్తూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికీ బీఆర్ నాయుడును చంద్రబాబు వెనకేసుకు వస్తున్నాడని ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు, సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు పట్టించుకోవట్లేదని మండిపడింది.

Read Also: మొదటి 3 నెలల్లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>