కలం, వలిగొండ: మండుటెండల్లో అడుగు బయటపెట్టాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటిది రోజంతా ఎండల్లోనే ఉంటూ, మామిడికాయలు (Mangoes) విక్రయిస్తూ.. బతుకు పోరాటం చేస్తున్నారు ఆ మహిళలు. వేసవి వచ్చిందంటే వలిగొండ మండల కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి మధురమైన తీయటి మామిడి పళ్లు వస్తుంటాయి. పురుషులు వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి, ఇంట్లో మహిళలకు అప్పగించి ఇతర పనులకు వెళ్లిపోతుంటారు. ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు మండుటెండల్లోనే గొడుగులు పట్టుకుని విక్రయాలు సాగిస్తుంటారు. రోడ్డు పక్కన భానుడి భగభగలను తట్టుకొని మహిళలు మామిడి పండ్లను అమ్ముతున్న దృశ్యాన్ని చూసిన పలువురు ఔరా.. అంటూ ప్రశంసిస్తున్నారు.

