Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం మహిళా జర్నలిస్టులకు ఘన సన్మానం

కలం, ఖమ్మం బ్యూరో : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Womens Day)పురష్కరించుకొని ఆదివారం ఖమ్మం వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI), ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు(Women Journalists) సన్మానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డబ్ల్యూజేఐ ఖమ్మం (Khammam) జిల్లా నాయకులు మాట్లాడుతూ నేటి సమాజ గమనాన్ని మార్చడంలో, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో జర్నలిజం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ రంగంలో మహిళలు అడుగు పెట్టడం ఒక ఎత్తయితే, సవాళ్లను ఎదుర్కొని రాణించడం మరో ఎత్తని పేర్కొన్నారు. ఒకప్పుడు జర్నలిజం అంటే కేవలం పురుషులకే పరిమితమైన రంగం అనే భావన ఉండేదని, కానీ నేడు ఆ భావన పటాపంచలైందని అన్నారు. క్షేత్ర స్థాయిలో వార్తల సేకరణ నుండి, స్టూడియోలో చర్చల నిర్వహణ వరకు మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు.

సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను, అణచివేతలను వెలుగులోకి తీసుకు రావడంలో సామాజిక స్పృహ కలిగిన మహిళా జర్నలిస్టులు ముందుంటున్నారని ప్రశంసించారు. యుద్ధ ప్రాంతాలు, ప్రకృతి వైపరీత్యాలు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి మహిళా జర్నలిస్టులు రిపోర్టింగ్ చేస్తున్నారని గుర్తు చేశారు. ఒక మహిళా జర్నలిస్ట్ రాసే వార్తల వెనుక కేవలం సమాచారం మాత్రమే ఉండదని, ఒక తపన, ఒక పోరాటం, సమాజం పట్ల బాధ్యత ఉంటుందని అన్నారు. నేటి డిజిటల్ యుగంలో జర్నలిజం ఎంతో వేగంగా మారుతున్నా, పని ఒత్తిడి పెరుగుతున్నా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా పురుషులతో సమానంగా, కొన్ని సార్లు వారి కంటే మిన్నగా పని చేస్తున్న తీరు అమోఘమని తెలిపారు.

అడ్డంకులను అధిగమించి, అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుని ముందుకు సాగుతున్న ప్రతి మహిళా జర్నలిస్టుకు ఈ సన్మానం ఒక చిన్న కృతజ్ఞత మాత్రమేనని పేర్కొన్నారు. వారు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డబ్ల్యూజేఐ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రహ్మణ్యేశ్వర రావు, జిల్లా నాయకులు గంటేల ఆనంద్, వై. శ్రీనివాస్ రావ్, ఏం. ఏ అన్సార్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Read Also: విమెన్స్ డే స్పెషల్ : బ్రిలియంట్ ఆఫీసర్.. సైలెంట్ ఆపరేషన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>