కమ్యూనిటీ హాల్ నాణ్య‌త‌తో నిర్మించాలి: సునీల్ రావు

క‌లం, క‌రీంన‌గ‌ర్ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయ‌ర్ యాద‌గిరి సునీల్ రావు (Deputy Mayor Sunil Rao) డివిజన్‌లో జరుగుతున్న కమ్యూనిటీ హాల్ అభివృద్ధి, నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక కమ్యూనిటీ కమిటీ బాధ్యులతో కలిసి నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అధికారులతో, కాంట్రాక్టర్‌తో మాట్లాడుతూ.. నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేసి, అతి త్వరలోనే డివిజన్ ప్రజలకు ఒక మంచి కమ్యూనిటీ హాల్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు.

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర

ఆషాడమాసం సందర్భంగా కరీంనగర్ నగరంలోని మార్కండేయనగర్, రాంనగర్ ప్రాంతాల్లో పోచమ్మ తల్లి బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మార్కండేయనగర్ పద్మశాలి సంఘం, రాంనగర్ మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Sunil Rao) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ రావు భక్తిశ్రద్ధలతో నెత్తిన బోనమెత్తి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ గాజ రామ-శివరాం, 13వ డివిజన్ కార్పొరేటర్ తేల్ల లక్ష్మి-రమేష్, పద్మశాలి, మున్నూరు కాపు సంఘాల పెద్దలు పాల్గొన్నారు.

‘మన్ కీ బాత్’ వీక్షించిన సునీల్ రావు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 136వ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని సునీల్ రావు వీక్షించారు. ఆదివారం ఉదయం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, డివిజన్ వాసులతో కలిసి ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం, దేశాభివృద్ధిలో సామాన్యుల భాగస్వామ్యం, వివిధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతి గురించి ఆయన పంచుకున్న అంశాలు అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయన్నారు.

11వ డివిజన్ కాంటెస్టెడ్ బీజేపీ కార్పొరేటర్ పండుగ స్వప్న–నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో డాక్టర్ ఎలగందల శ్రీనివాస్, వాసుదేవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారం కట్టరాంపూర్‌లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా సునీల్ రావు పాల్గొని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో ప్రముఖ జనరల్ లాప్రోస్కోపిక్, లేజర్ సర్జన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ రోగులను పరీక్షించి బ్లడ్ షుగర్, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, హెర్నియా, హైడ్రోసీల్, వెరికోజ్ వెయిన్స్, డయాబెటిక్ ఫుట్, బ్రెస్ట్ లంప్స్‌తో పాటు ఇతర శస్త్రచికిత్సలకు సంబంధించిన సమస్యలపై ఉచిత వైద్య సలహాలు అందించారు. కార్యక్రమంలో కోలకాని నరసయ్య, మహేందర్, శేఖర్, శ్రీనివాస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీల ప్రముఖులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Read Also: ప్రధాని మోదీ ఓడిపోయారు: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>