నిర్మల్‌లో లోకమాన్య సహకార సంఘం సమావేశం

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో లోకమాన్య పరస్పర సహాయక పొదుపు పరపతి సహకార సంఘం మూడో సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంఘం ఛైర్మన్‌గా భూసారాపు గంగాధర్..

ఎన్నికల అధికారి కందూరి శంకర్ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి పాలకవర్గ ఎన్నికలు నిర్వహించారు. సంఘం ఛైర్మన్‌గా భూసారాపు గంగాధర్ వరుసగా నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయారు. సెక్రటరీగా మహాజన్ సతీష్, క్యాషియర్‌గా అన్నం వాసుదేవరెడ్డి, జాయింట్ సెక్రటరీగా మైసర్ల వెంకటరమణ, జాయింట్ ట్రెజరర్‌గా జతల శ్రీనివాస్, డైరెక్టర్లుగా చిప్ప ప్రమోద్, శేరే వ్యాస్, మూర్తి అనిత, కుంట అన్నపూర్ణ, దేశ్కర్ భీంరావ్ ఎన్నికయ్యారు.

రూ.4.5 లక్షల లాభం..

ఈ సందర్భంగా అధ్యక్షుడు భూసారాపు గంగాధర్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల్లోనే సంఘం 600 మంది సభ్యులతో అభివృద్ధి సాధించి, 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.4.5 లక్షల లాభాన్ని నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇప్ప ముత్యం రెడ్డి, సహకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు యెక్కటి ఉపేందర్ రెడ్డి, ఛార్టెడ్ అకౌంటెంట్ ముక్క సాయి ప్రసాద్, సహకార భారతి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల సంఘటన ప్రముఖ్ పొన్నాల యాదగిరి, ఆర్‌ఎస్‌ఎస్ నిర్మల్ జిల్లా సంఘచాలక్ నూకల విజయ్ కుమార్, పెద్దల కమిటీ సభ్యులు నార్లపురం రవీందర్, మంచిరాల నాగభూషణం పాల్గొన్నారు.

Read Also: ‘సర్‌’లో ఒక్క ఓటు మిస్ కావొద్దు: శ్రీహరి రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>