నాలుగన్నరేళ్ల పాలనలో ఒక్క పేపర్ లీక్ కాలేదు : సీఎం భగవంత్ మాన్

కలం, వెబ్ డెస్క్ : పంజాబ్‌లో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలపై సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) స్పందించారు. తన నాలుగన్నరేళ్ల పాలనలో పంజాబ్‌లో ఏ ఒక్క పోటీ పరీక్ష ప్రశ్నాపత్రం కూడా లీక్ కాలేదన్నారు. ఆదివారం చండీగఢ్ సమీపంలోని జిరక్‌పూర్‌లో జరిగిన ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో భగవంత్ మాన్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొద్ది రోజుల క్రితం ఫార్మసీ అధికారుల నియామక పరీక్షలో కాపీయింగ్ ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. అయితే, పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాలకే చీటింగ్ కి పాల్పడిన వారిని పట్టుకున్నామని ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారని తెలిపారు. ఫార్మసీ అధికారుల నియామక పరీక్షలో భారీ కుంభకోణం విపక్షాలు ఆరోపిస్తున్న వేళ సీఎం భగవంత మాన్ పరోక్షంగా సమాధానం ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>