Mobile Popup Ad
Mobile Popup Ad

హాకీలో భారత్‌కు చేదు అనుభవం.. ఆస్ట్రేలియా ఘన విజయం

కలం, వెబ్‌డెస్క్: మహిళల హాకీ (Women Hockey) లో భారత్‌ ( India) కు నిరాశ ఎదురైంది. భారత్–ఆస్ట్రేలియా (Australia) మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల ఫ్రెండ్లీ సిరీస్ తొలి పోరులో ఆస్ట్రేలియా 2-1 తేడాతో విజయం సాధించింది. పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలుత ఆధిక్యం సాధించింది. తొలి క్వార్టర్‌లో నవ్‌నీత్ కౌర్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి జట్టుకు 1-0 లీడ్ అందించింది. భారత రక్షణ విభాగం తొలి అర్ధభాగం మొత్తం పటిష్టంగా ఆడి ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. అయితే రెండో అర్ధభాగంలో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆస్ట్రేలియా ఆటగాడు అబ్బీ విల్సన్ రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంది.

మూడో, నాలుగో క్వార్టర్లలో ఒక్కో గోల్ చేసి ఆస్ట్రేలియాకు 2-1 తేడాతో కంబ్యాక్ విజయాన్ని అందించింది. ఇరు జట్లు మే 27న సిరీస్ రెండో మ్యాచ్‌లో మరోసారి తలపడనున్నాయి. 22 మంది సభ్యులతో ఉన్న భారత జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 9వ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 8వ స్థానంలో ఉంది. మిగతా మ్యాచ్‌ల్లో భారత్ ఎలా పుంజుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>