కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) కీలక ప్రకటన చేయబోతున్నా అంటూ రాజకీయ వర్గాలలో ఆసక్తి రేకెత్తించారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగించనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ప్రసంగంలో ఒక “భారీ ప్రకటన” చేయబోతున్నానని పేర్కొనడంతో పార్టీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “నా టీడీపీ నా బాధ్యత”, “మహానాడు 2026”, “స్త్రీ శక్తి” వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీడీపీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం, మహిళల సాధికారత లేదా యువతకు సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ తొలి ప్రసంగం కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహానాడు వేడుకల నేపథ్యంలో జరగనున్న ఈ ప్రసంగం టీడీపీకి కొత్త దిశానిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

