Mobile Popup Ad
Mobile Popup Ad

బాలింత ప్రాణం తీసిన ఇడ్లీ.. బాన్సువాడ ఆసుపత్రిలో ఘటన

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇడ్లీ బాలింత ప్రాణం తీసింది. ఓ మాతృమూర్తి బిడ్డకు జన్మనిచ్చిన సంతోషంతో మునిగి తేలుతున్న రెండు కుటుంబాలలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. పిట్లం మండలం బండపల్లికి చెందిన అర్చన బాన్సువాడ (Banswada) ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే సాధారణ ప్రసవం తర్వాత ఆమెకు కుటుంబ సభ్యులు ఇడ్లీ తినిపించారు. అది కాస్తా గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఆస్పత్రిలోనే ఆమె శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరైంది. పడుకొని తినిపించడం వల్ల ఇడ్లీ గొంతులో అడ్డుపడినట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స చేసినప్పటికీ శ్వాస ఇబ్బంది తప్పలేదు. బిడ్డ క్షేమంగా ఉన్నప్పటికీ మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బిడ్డ జన్మించిన కొద్దిసేపటికే తల్లి అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయభాస్కర్ వివరణ ఇచ్చారు. డెలివరీ తర్వాత అర్చనకు ఇడ్లీ ఇవ్వగా.. ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస ఆడక మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాన్సువాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>