Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’ స్పెషల్ సాంగ్.. హీరోయిన్ ఎవరంటే!

కలం, వెబ్ డెస్క్: బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ‘పెద్ది’ మూవీ (PEDDI) షూటింగ్ ఒక స్పెషల్ సాంగ్ మినహా పూర్తయింది. ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా.. ఈ పాట, కొంత పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా జూన్ 25న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పక్కన ఆడి పాడే హీరోయిన్ కోసం కొన్ని రోజులుగా మేకర్స్ వెతుకుతున్నారు. ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చినా.. చివరికి శృతి హాసన్ ఓకే అయింది.

నెలాఖరులోగా షూట్ కంప్లీట్..

శృతి హాసన్ టైట్ షెడ్యూల్ కారణంగా.. వీలైనంత త్వరగా ఈ పాటను తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇందుకోసం, హైదరాబాద్ లోనే వేగంగా సెట్ వర్క్ జరుగుతోంది. రెండు మూడు రోజులు రిహార్సల్స్ చేశాక.. ఈ నెలాఖరులోగా షూట్ కంప్లీట్ చేయబోతున్నారని సమాచారం. రామ్ చరణ్–శృతి హాసన్ కలిసి ‘ఎవడు’ మూవీలో నటించడంతో పాటు అందులోనూ స్పెషల్ సాంగ్ చేసి అలరించారు. మరి.. బుచ్చిబాబు మూవీలో పాట దాన్ని బీట్ చేస్తుందా..? అనే చర్చ మెగా అభిమానుల్లో మొదలైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>