నిర్మల్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ఇళ్లను శుభ్రం చేసి పూజా మండపాలను అందంగా అలంకరించి అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. వ్రత కథను చదివి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>