కలం, వెబ్ డెస్క్: జనసేన (Janasena) పార్టీలో అరవ శ్రీధర్ (Arava Sridhar) వ్యవహారం మరువకముందే మరో జనసేన నేతపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకుడు తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకొని వదిలేశాడని మద్దాల విజయలక్ష్మి అనే మహిళ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆమె అన్ని వివరాలు వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జడ్పీటీసీ జయ ప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా, శారీరకంగా ఉపయోగించుకుని మోసం చేశాడని వీడియోలో వెల్లడించింది. ఇప్పుడు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. తాను జనసేనకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంట్లున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలో ప్రకాష్ నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి అన్ని రకాలుగా వాడుకున్నాడని చెప్పింది. పెళ్లికి ముందే ఇల్లు కొనుక్కుందామని రూ.10 లక్షలు, బంగారం తీసుకున్నాడని వెల్లడించింది. తనకు గంజాయి అలవాటు కూడా ఉందని, గంజాయి తీసుకొని తనను కొడుతూ చిత్రహింసలు పెట్టేవాడని ఆరోపించింది. ప్రకాష్‌తో దిగిన ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని చెప్పింది. తనకు న్యాయం చేయాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సదరు మహిళ కోరుతోంది. దీనిపై జనసేన (Janasena) అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
Read Also: ప్రయాణికులకు అలర్ట్.. 15 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Follow Us On: Instagram

