Mobile Popup Ad
Mobile Popup Ad

తిప్పర్తి సమీపంలో తప్పిన రైలు ప్రమాదం.. నిలిచిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) జిల్లా తిప్పర్తి సమీపంలో గురువారం ఒక భారీ రైలు ప్రమాదం తప్పింది. పల్నాడు – సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (Simhadri Express) రైలు పట్టాలపై ఉన్న గేదెను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తిప్పలమ్మ గూడెం సమీపంలో రైలు వేగంగా వెళ్తుండగా ఒక్కసారిగా గేదె అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. గేదెను ఢీకొట్టిన అనంతరం అది రైలు చక్రాల మధ్య ఇరుక్కుపోవడంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది.

లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని సమాచారం. ఈ ఘటన కారణంగా నల్గొండ – మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైలు చక్రాల కింద ఇరుక్కున్న గేదెను తొలగించేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పలు రైళ్లు వెనుక స్టేషన్లలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రైల్వే సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌ను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>