అనంతపురంలో దారుణం.. భర్తను చంపి ఇంటిముందే పాతిపెట్టిన భార్య

కలం, వెబ్​ డెస్క్​ : అనంతపురం (Anantapur) జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో ఓ మహిళ తన భర్తను చంపి ఇంటిముందే పాతిపెట్టింది. ఈ కేసులో భార్య సుకన్యను పోలీసులు అరెస్ట్​ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు.. నాలుగు నెలల క్రితం తన భర్త హనుమంతు (35) ను సుకన్య హత్య చేసింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ముందే పాతిపెట్టింది. ఈ క్రమంలో హనుమంతు తల్లి, సుకన్యల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇది కాస్తా పోలీస్​ స్టేషన్​ కు చేరడంతో అసలు విషయం బయటపడింది. ఈ గొడవలోనే సుకన్య తను చేసిన నేరాన్ని ఒప్పుకుంది. తానే హనుమంతును హత్య చేసి ఇంటి ముందే పాతిపెట్టినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సుకన్యను అరెస్ట్​ చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పాతిపెట్టిన స్థలంలో పోలీసులు తవ్వకాలు చేపట్టారు. కాగా, ఈ ఘటన జిల్లాలో  తీవ్ర కలకలం రేపింది.

Read Also: మార్కాపురం బస్సు ప్రమాదం.. పోలీసుల అదుపులో డ్రైవర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>