కలం, నల్లగొండ బ్యూరో : శ్రీరామనవమి (Sri Rama Navami) పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నకిరేకల్ పట్టణంలోని శివాలయం, సాయిబాబా ఆలయాలను దర్శించిన ఆయన, అక్కడ జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేతేపల్లి మండలం బండపాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవంకు హాజరై, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం (Vemula Veeresham) మాట్లాడుతూ, ఆ శ్రీరాముని ఆదర్శాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అన్వయించుకోవాలని సూచించారు. రామరాజ్యం అంటే ధర్మం, న్యాయం, సత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని ఆయన కోరారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
Read Also: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మంచులక్ష్మి భేటీ.. కారణమేంటి?
Follow Us On : WhatsApp

