కొడుకుతో కలిసి గోదావరిలో దూకిన మహిళ

కలం/ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన జరిగింది. పాల్వంచ మంచికంటి నగర్‌కు చెందిన స్వరూప అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం మధ్యాహ్నం సమయంలో తన రెండేళ్ల కుమారుడితో భద్రాచలం బ్రిడ్జిపై నుండి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అదే సమయంలో అక్కడ ఉన్న బోటు నడిపే వ్యక్తి ప్రసాద్, చేపలు పట్టడానికి వెళ్ళిన ఇద్దరు యువకులు మహిళ గోదావరి నదిలో దూకడాన్ని గమనించారు.

డీడీఆర్ఎఫ్ బృందం సహా వారు నదిలోకి దూకి మహిళను, ఆమె రెండేళ్ల కుమారుడిని కాపాడారు. వెంటనే అంబులెన్స్ లో ఇరువురిని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు వారిరువురికి చికిత్సను అందించి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. ఈ సందర్భంగా తక్షణమే స్పందించి తల్లీకొడుకు ప్రాణాలను కాపాడిన బోటు డ్రైవర్ ప్రసాద్, డీడీఆర్ఎఫ్ బృందం సభ్యులు, ఇద్దరు స్థానిక యువకులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

Read Also: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ స్టాండ్ ఇదే..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>