Mobile Popup Ad
Mobile Popup Ad

యువ‌తికి వేధింపులు.. సైబరాబాద్ సీపీ సీరియస్ యాక్షన్!

క‌లం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad)లో ఒక యువతికి చేదు అనుభవం ఎదురైంది. నగరంలోని సోలార్ సైకిల్ ట్రాక్ పై ఉదయం వేళ ఆమె వాకింగ్ చేస్తుండగా ఒక వ్య‌క్తి అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన బాధితురాలు తన ఆవేదనను సెల్ఫీ వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. సురక్షితమైన నగరం అనుకున్న చోట కూడా ఇలాంటి వేధింపులు ఎదురుకావడం పట్ల ఆమె తన వీడియోలో ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తక్షణమే స్పందించారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూ ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆపద సమయాల్లో ఉన్న పౌరులు ఏమాత్రం జాప్యం చేయకుండా 100 నెంబర్ కు కాల్ చేయాలని లేదా అధికారికంగా ఫిర్యాదులు నమోదు చేయాలని సీపీ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>