కొనసాగుతున్న NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె

కలం, నాగర్‌కర్నూల్: నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల ఆందోళన (NHM Protest) మంగళవారంతో 15వ రోజుకు చేరుకుంది. డిమాండ్లను తీర్చాలంటూ సీఎం కార్యాలయానికి ఈ-మెయిల్ ఉద్యమాన్ని చేపట్టారు. ప్రతి ఉద్యోగి తన వ్యక్తిగత ఈ-మెయిల్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి తమ సమస్యలను వివరిస్తూ మెయిల్ పంపించారు. ఈ సందర్భంగా NHM జేఏసీ జిల్లా అధ్యక్షుడు డా.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ మాట్లాడుతూ.. ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు.

సమ్మెకు నేతల సంఘీభావం..

NHM ఉద్యోగుల సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, జిల్లా అధ్యక్షుడు రామచందర్, రామకృష్ణ తదితర నాయకులు సంఘీభావం ప్రకటించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు తమ వంతు సహాయంగా రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.
బీజేపీ పట్టణ అధ్యక్షుడు ప్రమోద్‌, ఇతర నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, సభ్యులు హైమవతి, ప్రవీణ్, డాక్టర్ జగన్, డాక్టర్ సాయి కాంత్, డాక్టర్ మహతి, భాగ్య పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>