పారిశ్రామిక భద్రతపై ‘బయోకాన్’ ముందడుగు.. ‘మాక్ డ్రిల్’ సక్సెస్

కలం మెద‌క్ బ్యూరో: పరిశ్రమలల్లో ప్రమాదాలు జరిగిననప్పుడు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై బయోకాన్ లిమిటెడ్ కంపెనీ మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహించింది. సంగారెడ్డి జిల్లాలోని (Sangareddy) పాశమైలారం పారిశ్రామిక వాడ‌లో మాక్ డ్రిల్ విజయవంతంగా పూర్తైంది. ప్రజలు, కార్మికుల్లో నమ్మకాన్ని పెంపొందించ‌డ‌మే ల‌క్ష్యంగా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, పర్యవేక్షణలో మాక్ డ్రిల్ జరిగింది. అంబులెన్స్, అగ్నిమాపక శకటాలు, వైద్య బృందాలు, పోలీస్, రెవిన్యూ, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టిన సహాయక చర్యలు విపత్తుల నిర్వహణపై సన్నద్దతను చాటి చెప్పాయి.

అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. కంపెనీలో ఏర్పాటు చేసిన ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఏ కంపెనీలోనైనా ప్రమాదం సంభవించిన వెంటనే, సంబంధిత అధికారులు పోలీసు శాఖకు సమాచారం అందజేయాలని సూచించారు. అలాగే కంపెనీ యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టడంతోపాటు సంబంధిత ప్రభుత్వ శాఖలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో అప్రమత్తతతో నష్టాన్ని నివారించవచ్చనన్నారు.

Read Also: విషాదం.. ఏనుగుల ఘర్షణలో మహిళ మృతి

Follow Us On: WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>