కలం, నిర్మల్: గోదావరి పుష్కరాలు – 2027 (Godavari Pushkaralu) సందర్భంగా భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా అన్ని భద్రతా ఏర్పాట్లను పూర్తి చేయాలని ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) సూచించారు. గురువారం హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) పాల్గొన్నారు.
పుష్కరాల సందర్భంగా సీసీటీవీ నిఘా, డ్రోన్ సర్వైలెన్స్, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర స్పందన బృందాల ఏర్పాటు, పార్కింగ్, బ్యారికేడింగ్ తదితర భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

