ముసురు వానలు.. పొలాల బాట పట్టిన కూలీలు

కలం, వలిగొండ: ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో వలిగొండ (Valigonda) మండలంలో విస్తారంగా ముసురు వాతావరణం నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం కురుస్తున్న వానలు రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాలలో ముసురు వాతావరణం కొనసాగుతుండటంతో వ్యవసాయ కూలీలు పొలాల బాట పట్టారు. వరి నాట్లు జోరుగా సాగుతుండగా, పత్తి పొలాలలో కలుపు తొలగింపు పనులు ఊపందుకున్నాయి. వర్షాలు అనుకూలంగా కురుస్తుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు పనులలో నిమగ్నమయ్యారు. దీంతో వలిగొండ మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులతో (Agricultural Activities)  సందడి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>