కలం, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషురెడ్డి (Ashureddy) తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించింది. అషురెడ్డి తన కొడుకు ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నగలు, ఫ్లాట్లు, నగదు రూపంలో రూ.9.35 కోట్లు తీసుకుందని ధర్మేంద్ర తండ్రి షేక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అషురెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే తనతో పెళ్లికి అంగీకరించేలా ధర్మేంద్ర తన కుటుంబాన్ని ఒప్పించేందుకు తన ఇష్టపూర్వకంగానే రూ.9.35 కోట్లు ఖర్చు చేశాడని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని అషురెడ్డి కోర్టుకు వెల్లడించింది. ఎటువంటి ఒప్పందం లేకుండా జరిగే ఆర్థిక లావాదేవీలు క్రిమినల్ నేరం కిందకు రావని, తన ప్రమేయం లేకుండా ఏకపక్షంగా జరిగిన పనులకు తనను బాధ్యురాలిని చేయలేరని అషురెడ్డి తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై స్పందించిన హైకోర్ట్ సీసీఎస్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ఆదేశించింది. ఈ కేసు విచారణను మే 4కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

