కలం, వెబ్ డెస్క్: దేశంలో గ్యాస్ కొరత (Gas Shortage) లేదని కేంద్రం చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. గ్యాస్ బుక్ చేసి రెండు మూడు వారాలైనా రావడం లేదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల గ్యాస్ కోసం చిన్న పాటి యుద్ధాలే జరుగుతున్నాయి. ఇక హోటళ్లు, రెస్టారెంట్ల కష్టాలు వర్ణణాతీతం. తాజాగా గ్యాస్ సిలిండర్ కోసం ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనంతపురం (Anantapur) జిల్లాలోని గుత్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉండే హరికృష్ణ ఇంట్లో మూడు నెలల క్రితం వంట గ్యాస్ అయిపోయింది. దీంతో భార్య మహాలక్ష్మి కట్టెల పొయ్యిపైనే వంట చేస్తోంది. కొత్త గ్యాస్ సిలిండర్ తీసుకురావాలని భర్తుకు చెప్తూనే ఉంది. అయితే బయట గ్యాస్ కొరత దృష్ట్యా ఎక్కడా సిలిండర్ దొరకడం లేదు. ఇదే విషయాన్ని హరికృష్ణ భార్యకు చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన మహాలక్ష్మి ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహాలక్ష్మిని భర్త ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని డాక్టర్లు వెల్లడించారు.
Read Also: మావోయిస్టు పార్టీ : 60 ఏళ్ళ ప్రస్థానం.. రెండేళ్లలో పతనం!?
Follow Us On : WhatsApp

